పుట:Jyothishya shastramu.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏ మనిషి ఎప్పుడు పుట్టినా అతని జాతక లగ్నమును పంచాంగము ద్వారాగానీ, కంప్యూటర్‌ ద్వారాగానీ తీసుకొనియున్నా ప్రస్తుతము జరిగే వర్తమాన కాలములో గ్రహముల స్థితి గతులు ఎలా ఉన్నాయి, గ్రహముల గమనములో మనకు కావలసిన లగ్నములో ఏ గ్రహమున్నది. ఏ గ్రహము రాబోతుంది అని వర్తమాన కాల పరిస్థితులను తెలియుటకు ప్రతి ఒక్కరూ పంచాంగమునే చూడవలెను. ఇంతకుముందు రాజీవ్‌గాంధీగారి జన్మ కుండలిని వ్రాసుకొని చూచాము. ఆ కుండలిని మేము 1983వ సంవత్సరమే పత్రికలో చూచాము. అయినా ఆ దినము ఆ జాతకమును సంపూర్ణముగా చూడలేదు. అప్పుడు నేను జ్యోతిష్యము మీద పరిశోధన చేయుకాలము. కావున కొందరి జాతకములు సేకరించి కొన్ని విషయము లను మాత్రము వాటిలో చూడడము జరిగినది. అప్పుడు చూడని విషయమును 1985వ సంవత్సరము పరిశోధన నిమిత్తము చూచాను. ఆయువు విషయములో కొంతవరకు అంచనా వచ్చినా అప్పుడది నిర్ధారణ లేని విషయము మాత్రమే. అయితే ఆ అంచనా కొంతకాలమునకు నిజమైనది. అప్పుడు ఆ సంఘటనతో జ్యోతిష్యము శాస్త్రమనీ, మూఢ నమ్మకముకాదనీ అనుకొన్నాము. ఆ ఒక్క విషయముతోనే జ్యోతిష్యమును శాస్త్రమనలేదు. మా పరిశోధనలో ఇటువంటి కొన్ని ఇతర విషయములు ప్రత్యక్షముగా జరుగుట వలన పూర్తిగా జ్యోతిష్యమును శాస్త్రమని చెప్పడము జరిగినది. ఏదైనా తప్పు అయితే అది జ్యోతిష్యునిలో ఉంటుందిగానీ, జ్యోతిష్యములో ఉండదు.

1985వ సంవత్సరము రాజీవ్‌గాంధీ జాతకమును మేము చూచినప్పుడు అందులో ఆయుష్షు విషయములో కొంత అనుమానము వచ్చి ఒక అంచనాకు వచ్చి ఇలా జరుగవచ్చునని అనుకొన్నాము. అది