పుట:Jyothishya shastramu.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచాంగము హిందువులది అని అనుకోవడము వలన వారు ఎవరూ పంచాంగమును తాకను కూడా తాకరు. ఇట్లు అనేక విధములుగా పంచాంగము నేడు చాలామందికి తెలియకుండా పోయినది.

నేడు మేము చెప్పునది ఏమనగా! నేడు జ్యోతిష్యులు కూడా కంప్యూటర్‌ ముందు కూర్చొని భవిష్యత్తునూ, భవిష్యత్తుకు సంబంధించిన ముహూర్తములనూ చెప్పుచున్నారు. అలాకాకుండా ప్రతి జ్యోతిష్యుడూ పంచాంగమును దగ్గరుంచుకొని దానిప్రకారము భవిష్యత్తునిగానీ, ముహూర్తములనుగానీ చెప్పడము మంచిది. అలాకాకుండా కంప్యూటర్లలో చూచి చెప్పడము వలన శ్రమ తగ్గినా పైనగల గ్రహముల అనుగ్రహము మనమీద ఉండదని నేను అనుకొంటున్నాను. అందువలన జ్యోతిష్యమునకు ఎవరైనా పంచాంగమునే ఉపయోగించుకోమని తెల్పుచున్నాము. ఒక వ్యక్తి జ్యోతిష్యునిగా మారుటకు జ్యోతిష్యమునకు అధిపతియైన బుధగ్రహము సహకరించినప్పుడే మంచి జ్యోతిష్యునిగా పేరురాగలదు. గ్రహముల స్థితి గతులు ముద్రించియున్న గ్రంథమైన పంచాంగములో కనిపించని శక్తి నిక్షిప్తమైయుండి పంచాంగముమీద గల జ్యోతిష్యుని మనోభావమును బట్టి అతని బుద్ధికి సత్యమైన మాటలను పలుకునట్లు సూచనలిచ్చును. కంప్యూటర్‌ ఒక యంత్రము అయినందున గ్రహముల అనుగ్రహము దానినుండి లభించదు. అందువలన చెప్పినమాట సత్యము కాకుండా పోవుటకు అవకాశముగలదు. జ్యోతిష్యునివద్ద కంప్యూటర్‌ ఉన్నా కొన్ని గణితములను దానియందు సులభముగా తెలియగల్గినా కంప్యూటర్‌ ముందు పంచాంగము పెట్టుకొని, దానిని గౌరవిస్తూ జ్యోతిష్యము చెప్పుట మంచి కార్యమగును.