పుట:Jyothishya shastramu.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలుపుకొంటే మొత్తము పది దిశలు అగుచున్నవి. దేవుడు మనకు కనిపించకపోయినా, తెలియకపోయినా పది దిశలయందు సర్వత్రా వ్యాపించి యున్నాడు. అందువలన దేవున్ని గుప్తముగా దశ అన్నారు. దేవుడు చేయు పనినిగానీ, దేవునివలన జరుగు పనినిగానీ అర్థముతో ఉండునట్లు దశ+ఆచారము = దశాచారము అని అన్నారు. దశ అనగా పదివైపులగల దేవుడని ఆచారము అనగా పని అని తెలియుచున్నది.

దశాచారము భగవద్గీతలో జ్ఞానయోగమున 37వ శ్లోకమందు చెప్పిన సారాంశము ప్రకారము కర్మను తీసివేయనూ గలదు. అలాగే దైవాసుర సంపద్విభాగ యోగమున గల 19వ శ్లోకమున చెప్పిన సారాంశము ప్రకారము కర్మను తగిలించనూగలదు. అందువలన దశాచారములో కర్మ తీసివేయబడుతుంది మరియు కర్మ కలుపబడుతుందని చెప్పాము. ఈ విధానము దశాచారములో మాత్రము కలదు. గ్రహచారములో ఏ విధానము చేతగానీ పాతకర్మ తీసివేయబడదు. అట్లే క్రొత్త కర్మ కలుపబడదు. దశాచారములో మాత్రము కర్మను లేకుండ చేసుకొను అవకాశమును దేవుడు కల్పించాడు. ఇక్కడ ఉదాహరణగా ఒక విషయమును చెప్పెదను జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మీకు జగన్‌ అను ఒక వ్యక్తి జాఫతకమును గురించి వివరిస్తూ వస్తున్నాము. అతని జాతకము కొన్ని విషయములు తప్ప అన్ని విషయములలోనూ గొప్పగాయున్నదని చెప్పుచున్నాము. అయితే ఆయన ఆయుష్షు విషయములో ఒక లోపమున్నదని చెప్పవచ్చును. అదేమనగా! శత్రుగ్రహము లేక అశుభ గ్రహము లేక పాపగ్రహము అని చెప్పబడు కుజ గ్రహము ఈ జాతకములో సరిగ్గా రెండవ స్థానమున కలదు. రెండవ స్థానములో ఉండడమేకాక తనకు ఎదురుగానున్న ఎనిమిదవ స్థానమును తనకున్న నాలుగు చేతులలో ఒక దానిచేత తాకుచున్నది. తనచేత అక్కడున్న