పుట:Jyothishya shastramu.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

‘‘మ్రొక్కువాడ ముందు, మ్రొక్కువాడ వెన్క,

మ్రొక్కువాడ సర్వ దిక్కులందు’’ అని చెప్పడము జరిగినది. ఈ వాక్యములు అందరికీ అర్థమగునవే. ఇందులో రహస్యమేమీ లేదు. అయినా మనము సర్వసాధారణ అర్థముగల మాటగా చెప్పుకొన్నా ప్రత్యేకమైన విశేషత కలదు. ఆ విశేషత ఏమనగా! రెండవ వాక్యములో ‘‘మ్రొక్కువాడ సర్వదిక్కులందు’’ అని అన్నప్పుడు మొత్తము ఎనిమిది దిక్కులయందు మ్రొక్కుచున్నానని అర్థము కదా! ఎనిమిది దిక్కులలోనే ముందు వెనుక రెండు దిక్కులుకలవని మరువకూడదు. అయితే మొదటి వాక్యములో ‘‘మ్రొక్కువాడ ముందు, మ్రొక్కువాడ వెన్క’’ సర్వదిక్కులైన ఎనిమిది దిక్కులు కాక ముందు వెనుక అనునవి ప్రత్యేకముగా ఉన్నాయా అని అనుమానము వచ్చును. ఈ మాటలు సర్వసాధారణములే అని వదలి వేస్తే విశేషత ఏమీ ఉండదు. ఈ మాటను గురించి ప్రత్యేకముగా యోచించితే యోచింపజేయు ఆత్మ ఒక మాటను చెప్పుచున్నది. తలదించి చూస్తే కనిపించునది క్రింద, తల ఎత్తి చూస్తే కనిపించునది పైన, క్రిందిది ఎల్లవేళల కనిపించుచున్నది కావున దానిని ముందుది అన్నారు. అదే పనిగా తల ఎత్తి చూస్తే గానీ కనిపించని పై భాగమును వెన్క అన్నారు. దేవుడు సర్వదిక్కులైన అష్టదిక్కులయందే కాదు పైన క్రింద కూడా ఉన్నాడు కాబట్టి, సర్వదిక్కులకేకాక ముందు (క్రింద) వెనుక (పైన) మ్రొక్కుచున్నానని అర్జునుడు చెప్పడము జరిగినది. ఆ దినము అర్జునుడు జ్ఞానము కలిగి ఆ మాట చెప్పలేదు. ప్రత్యక్షముగా కనిపించు దానినిబట్టి చెప్పాడు. ప్రత్యక్షముగా కనిపించు దేవుడు అష్టదిక్కులందేకాక, పైన క్రింద కూడా కనిపించాడు. కావున అర్జునుడు అలా చెప్పియుంటాడని అనుకొందాము. ఇప్పుడు చుట్టూయున్నవి ఎనిమిది దిక్కులైతే పైన ఒకటి, క్రింద ఒకటి అని రెండిటినీ