పుట:Jyothishya shastramu.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దశల విషయమును గురించి చెప్పితే ప్రతి దశకు అంతర్థశలని కూడా కలవు. కుజ దశలో అంతర్దశలు తెలియుటకు ఒక సూత్రము కలదు. దానిప్రకారము మొదట కుజదశా సంఖ్యను తెలియవలసిన దశా సంవత్సర సంఖ్యచే గుణించగా వచ్చిన మొత్తమును 3 చే గుణించాలి. తర్వాత వచ్చిన మొత్తమును 30 సంఖ్యచే భాగించాలి. అప్పుడు భాగించగా వచ్చిన సంఖ్యను నెలలుగా, మిగిలిన శేషమును దినములుగా వ్రాసుకోవాలి.