పుట:Jyothishya shastramu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొద్దుగా ఉండునా, చురుకుగా ఉండునా అనియు ఈ స్థానమునుబట్టియే తెలియవచ్చును. ఐదవ స్థానము పూర్తి పుణ్య స్థానమగుట వలన ఇక్కడ మిత్రవర్గములోని ఏ గ్రహము చూచినా లేక తన హస్తములతో తాకినా అన్నీ మంచి ఫలితములే జాతకునికి లభించును. ఐదవ స్థానమున సంతానమునకు సంబంధించిన కర్మయుండుట వలన పుణ్య గ్రహము వలన మంచి సంతానము కలుగును. ప్రపంచ జ్ఞానమునకు నిలయమైన స్థానమగుట చేత అనుకూలమైన గ్రహము బలము చేత మంత్రి పదవి లభించును. అంతేకాక మంచి నడవడిక కల్గినవారై నిశ్చయ బుద్ధి కలవాడై బంధు, మిత్రులకు సలహాదారుడుగా ఉండును. పుణ్యగ్రహము వలన విద్యా, వినయము, విధేయత, వివేకము కల్గును. ముఖ్యమైన విషయములను తెలుసుకొనుట, మంచి విషయములను మాట్లాడుట దూరము ఆలోచనలు చేయుట ఉండును. ఇంకా ఘనత, గాంభీర్యము, గ్రామాధికారము కల్గును. గ్రంథ రచనలో ప్రావీణ్యత, మంత్రోపాసనలో ప్రసన్నత కల్గును. దానము చేయుట, న్యాయముగా నడుచుట కల్గి యుండును. పాపపుణ్యములలో విమర్శించుట, పాండిత్యములో ప్రతిభ, జ్ఞానశక్తి, జ్ఞాపకశక్తి, గ్రాహిత శక్తి, చేతిపని నైపుణ్యము, యంత్రములను సరిచేయు యుక్తియుండును. మంత్ర, తంత్ర, యంత్ర బలము కలుగును. గురుత్వము, గురు హోదా కల్గి యుండును. కార్యజయము, నిదానము, అధికారము, అన్నదానము, వంశాభివృద్ధి, నీతి, నియమము, శాంతిని కల్గించును. కీర్తి గౌరవములు వ్యాపింపజేయును. ఎవరూ చూడని వాటిని, ఎవరూ వినని వాటిని కనుగొను శక్తినిచ్చును. అధర్మములను ఖండిరచుట, ప్రజలకు హితునిగా, గురువుగా చూపించును. ఇతరులు అడిగిన ప్రశ్నకు సూటిగా జవాబునిచ్చు స్థోమతను కలుగజేయును. ఒకవేళ ఐదవ స్థానమున పాపగ్రహమున్నా