పుట:Jyothishya shastramu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుణ్యమును అందించదు, పాపము లేదు కనుక చెడునూ చేయలేదు. పుణ్య గ్రహము లేనిదానివలన గ్రహముల సంచారములో ఏ గ్రహము ఆ స్థానములోని వస్తే దానికి అనుకూలమైన వాటిని కలుగ జేయును.

ఆరవది - శత్రుస్థానము

ఆరవ స్థానము పాపపుణ్య మిశ్రమ స్థానము. ఇక్కడున్న మిత్ర గ్రహమును (పుణ్యగ్రహమును) బట్టి మంచియూ, శత్రు గ్రహమును (పాప గ్రహమును) బట్టి చెడుయూ జరుగుచుండును. ఇక్కడ శుభగ్రహమున్నా లేక తాకినా పుణ్యఫలము లభ్యమగుట వలన శత్రు, రుణ, రోగ, సమస్యలు ఉండవు. వడ్డీ వ్యాపారముతో, వైద్యవృత్తితో ధనార్జన కల్గించును. శత్రువులు ఉండరు, ఉన్నా వారే నశించిపోవుదురు, ఋణబాధలుండవు. ఋణము లున్నా సులభముగా తీరిపోవును. రోగములు రావు, ఒకవేళ వచ్చినా సులభముగా పోవును. కలహభయము, మనోచింత, ఇతరులు ద్వేషించడము, అపవాదులు, అపనిందలు, అనుమానములు, చెడు వ్యసనముల బాధలు ఉండవు. అంతేకాక డబ్బు వృథాగా ఖర్చుకాదు. అప్పులు ఇచ్చుటలోను, తెచ్చుటలోను, ఇప్పించుటలోను ఎటువంటి చిక్కులూ ఉండవు. ఆరవ స్థానమును చేరు పుణ్యగ్రహములనుబట్టి ఫలితములుండును. ఒకవేళ పాప గ్రహముండినా లేక అక్కడ తాకినా శత్రు, ఋణ, రోగ సమస్యలు జీవితమంతా ఉండును. ఏ గ్రహము లేకుండిన అటు ఇటుగాక మధ్య రకముగా జరుగుచుండును.

సప్తమము - కళత్రస్థానము

ఇది పూర్తి పాపస్థానము. ఇక్కడ పాపగ్రహముంటే అందులోని పాపమును అందించి మనిషిని చాలా ఇబ్బంది పెట్టును. జీవితములో