పుట:Jyothishya shastramu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చంద్రుడు

మనుషులలో బుద్ధికి అధిపతి చంద్రుడు, అదేవిధముగా నీటికి అధిపతి చంద్రుడు. అలాగే స్త్రీలకు, మనస్సుకు, సౌందర్యమునకు, జల సౌఖ్యమునకు, బలమునకు, పంటలకు, వెండికి, యాత్రలకు, గుర్రపుస్వారికి, నిద్రకు, వేగమునకు, సుగంధములకు, మాతృ ప్రీతికి, కోనేర్లు, బావులకు, కీర్తికి, స్త్రీ సుఖమునకు, తెల్లని మెత్తని గుడ్డలకు, సముద్రములకు, పుష్ఠికి, పూలకు, నదులకు, యాత్రలకు, తెలుపురంగుకు, చెరువులకు, శ్వాసకు, కడుపుకు, ముత్యములకు, ముఖ అలంకరణకు, గర్భముకు, మృదుత్వము నకు, సుఖభోజనమునకు, పాలకు, మనోజపమునకు, విమానయానమునకు, విమానములకు, నావలకు, అంతస్తుల భవనములకు చంద్రుడు అధిపతిగా యున్నాడు. అంతేకాక చౌడుభూములకు, లాడ్జీలకు, వర్షమునకు, ముద్ర ణాధికారమునకు, రాజ చిహ్నమునకు, సన్మానమునకు, ధాన్యములో వడ్లకు, వెన్నెలకు, శయన గృహములకు, సంతోషమునకు, వీర్యబలమునకు, అశ్వ వాహనమునకు, జ్ఞాపకశక్తికి, దూరాలోచనకు, శిరో ఆరోగ్యమునకు, మెదడు బలమునకు, గ్రాహితశక్తికి, ఈతలో నైపుణ్యమునకు, నదీస్నానమునకు, నీటి ప్రదేశములకు, చౌడుకు, జలచరములకు, ఇంగ్లీషుభాషకు, విలాస వస్తువులకు, వాయువ్యదిశకు, సోమవారమునకు తెల్లని పూలకు, మల్లె తోటలకు, చంద్రుడు అధిపతిగాయున్నాడు.

ఇప్పటికి ముప్పై ఐదు సంవత్సరముల క్రితమే చంద్రగ్రహములో నీళ్ళు లేవు అని ఖగోళశాస్త్రజ్ఞులు చెప్పినప్పుడు, నీటికి చంద్రుడు అధిపతి అయినందున చంద్రునిలో నీళ్ళు అపారముగా ఉన్నాయి అని మేము చెప్పడము జరిగినది. అప్పుడు నీళ్లు లేవు అని చెప్పిన శాస్త్రవేత్తలు రెండు సంవత్సరముల క్రిందట చంద్రునిలో నీళ్లు ఉన్నట్లు వారి పరిశోధనలో తెలిసినట్లు చెప్పారు. నీటికి చంద్రుడు అధిపతియైనందువలన మేము