పుట:Jyothishya shastramu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముందుగానే నీళ్ళు ఉన్నాయని చెప్పడము జరిగినది. ఒక మనిషి జాతకములో చంద్రుడు వ్యతిరేకముగా వున్నట్లయితే, అతనికి జీవితములో నీటివలన అనేక ఇబ్బందులుండునని చెప్పవచ్చును. ఏదో ఒక విధముగా నీటి బాధలు జీవితాంతము ఉండును. అటువంటి వాడు బావులు త్రవ్వితే నీళ్ళు రావు. బోర్లు వేయిస్తే నీళ్ళుపడినా బోరు పూడి పోవడమో లేక నీరు ఎండిపోవడమో జరుగును. అటువంటి వ్యక్తి ఎంతమంచిగా ఇల్లు కట్టు కొనినా వర్షపు నీరు కారడమో, ఇంటిలోనికి రావడమో జరుగును. బాత్‌రూమ్‌లో కొలాయిలు చెడిపోయి నీళ్ళకు ఆటంకము ఏర్పడును. సెప్టిక్‌ట్యాంక్‌ పైపులు పూడిపోయి నీళ్ళు పోవుటకు ఆటంకములు ఏర్పడుచుండును. ఏదో ఒక విధముగా నీళ్ళ సమస్యలు ఉండును. అదే చంద్రుడు జాతకునికి మిత్రుడైయుంటే అతని జీవితములో నీటివలన ఎటువంటి బాధాయుండదు. మిగతా రాశులలోనికి చంద్రుడు పోయినప్పుడు ఆ రాశులలోని కర్మనుబట్టి ప్రవర్తించుచూ మనిషికి సుఖ దుఃఖము కర్మప్రకారము కలుగజేయుచున్నాడు.

కుజుడు

పరాక్రమము, కోపము, సేనాధిపత్యము, సాహసము, విస్పోటనము, బాంబులు, తుపాకులు, మారణాయుధములు, కోతులు, కుక్కలు, కోరలు గల కూృారజంతువులు, కొమ్ములుగల ఎద్దులు, శస్త్రవిద్య, తర్కశాస్త్రము, శత్రువృద్ధి, ఉష్ణము, ఎర్రభూమి, రాళ్ళభూమి, కొండలు, బండలు, ఎరుపు రంగు, రక్తము, యవ్వనము, యువకులు, యుక్తవయస్సు స్త్రీల పరిచయము, మెట్టభూమి, పట్టుదల, ప్రభుభక్తి, లక్ష్యమును ఛేదించుట, జయము, దక్షిణ దిక్కు, అరణ్యములు, అరణ్య సంచారము, సంఢ్రచెట్టు లేక సంఢ్ర కట్టెలు, వేట జరుపుట, యువరాజు, కట్టెలు, ప్రవాహము, మరణశిక్ష, కోటలు,