పుట:Jyothishya shastramu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందించుచున్నవి. గ్రహములు చేయు పనిలో మార్పులేదు. అవి ఎల్లప్పుడు పని చేయవలసిందే. అలాగే అనుభవించే జీవునిలో మార్పులేదు. వాడు ఎల్లప్పుడు అనుభవించవలసిందే. అయితే మధ్యలోనున్న కర్మలో మాత్రము ఎంతో మార్పువున్నది. పన్నెండు గ్రహములు కర్మచక్రములోని కర్మను మాత్రము స్వీకరించుచున్నవిగానీ, కర్మకు అతీతమైన దేనినీ స్వీకరించలేదని చెప్పవచ్చును. ఒక మనిషి జీవితములో గ్రహములు తమ పనిని తాము చేయుచున్నవి. జీవుడు తన పనిని తాను చేయుచున్నాడు. జీవుని పని అనుభవించడము తప్ప వేరు పనిలేదను సూత్రమును మరువకూడదు. కాలచక్రములోగానీ పూర్తి క్రిందయున్న గుణచక్రములోగానీ ప్రతి జన్మకున్నదే ఉండును. అయితే ఒకే ఒక కర్మచక్రములో మాత్రము జన్మ జన్మకు మార్పువుండును. కర్మచక్రములోని కర్మ జన్మజన్మకు మారుచుండును. కాలచక్రములోని గ్రహముల పనిని ఖచ్చితముగా ఇంతేనని చెప్పవచ్చును. అలాగే గుణచక్రములోని జీవుని పనిని కూడా ఇంతేకలదని చెప్పవచ్చును. అయితే కర్మచక్రములోని కర్మ ఇంతే కలదని ఖచ్చితముగా చెప్పుటకు అవకాశము లేదు. కర్మచక్రములో పన్నెండు స్థానములందు ఏ కర్మ ఉండునో, ఆయా స్థానములలో ప్రవేశించిన గ్రహములు అక్కడున్న కర్మనే ఇచ్చుననీ, అలా కర్మను తీసుకొని జీవునికి ఇవ్వడమే గ్రహముల పనియని తెలియుచున్నది.

41. గ్రహములవద్ద ఏమీ ఉండవా?

కాలచక్రములోని గ్రహములవద్ద ఏమీ ఉండవు. కానీ ఒక్కొక్క గ్రహము ప్రపంచములో ఉన్న వస్తువులు అయిన వాహనములు, భవనములు, ఆభరణములు, లోహములు, ద్రవములు, కులములు, మతములు ఉన్న