పుట:Jyothishya shastramu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయుచుండినా, ఎవరు ఎటుపోయినా, అంతకూ వారు చేయుచున్న పని ఏమి? అని ప్రశ్నరాగలదు. ఆ ప్రశ్నకు జవాబుగా మేము చెప్పునది ఏమనగా! కాలచక్రములో ప్రయాణము చేయు ప్రతి గ్రహము ఒక ఉద్దేశ్యమును కలిగి ప్రయాణిస్తూ బాధ్యతగా పని చేయుచున్నవి. మనము చెప్పుకొన్న పన్నెండు గ్రహములలో ప్రతి గ్రహమునకు కొంత ప్రకాశమున్నది. గ్రహము తనకున్న ప్రకాశము దేనిమీదపడునో, అప్పుడు ఆ ప్రకాశము పడిన చోట ఏదైతే ఉన్నదో దానిని గ్రహము గ్రహించును. గ్రహమునకున్న కిరణముల చేత దేనినైనా గ్రహించుచున్నది. కావున కిరణములను గ్రహము యొక్క చేతులుగా పోల్చుకోవచ్చును. ఇంతకు ముందే గ్రహముల కిరణముల ప్రసారమునుబట్టి తొమ్మిది గ్రహములకు రెండు చేతులున్నాయనీ, ప్రత్యేకించి శని, కుజ, గురువులకు నాలుగు చేతులు కలవనీ చెప్పుకొన్నాము. చేతులు ఉన్నాయంటే ఏదో ఒక పని చేయాలి. కావున ప్రతి గ్రహము వెలుగు అను తన చేతుల చేత క్రింద కర్మచక్రములోని ప్రారబ్ధకర్మను తీసుకొని, ఇంకా క్రిందగల గుణచక్రములోని జీవునిమీదికి కర్మను వదులుచున్నవి. అప్పుడు అలా వచ్చిన కర్మను జీవుడు రుచి చూచుచున్నాడు. కర్మ రుచి తియ్యగా ఉంటే హాయిగా సుఖమును అనుభవించుచున్నాడు. ఒకవేళ కర్మ రుచి చేదుగాయుంటే బాధగా కష్టమును అనుభవించుచున్నాడు. జీవుడు ఏమి అనుభవించినా అదంతయు గ్రహములు చేసిన పనియేనని చెప్పవచ్చును.

గ్రహములు కర్మచక్రము మీద తమ కిరణములను (చేతులను) ప్రసరింపజేసినప్పుడు, అక్కడ ఏముంటే దానినే తీసుకొని క్రిందనున్న జీవుని నెత్తిన వేయుచున్నవి. కాలచక్రములోని గ్రహములు తమ పనిని చేయుచు వారుండు లగ్నములకు ఎదురుగాయున్న కర్మస్థానములలోని కర్మను జీవునికి