పుట:Jyothishya shastramu.pdf/156

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శుక్ర, రాహు, శని, మిత్ర, చిత్ర అను ఆరు గ్రహములు వ్యతిరేకులుగా యున్నారు. వీరి పేరుతోనే దశలుండుట వలన ఆయా గ్రహముల దశలలో మంచివిగా కొన్ని, చెడువిగా కొన్ని యున్నవని చెప్పవచ్చును. మిత్ర శత్రు గ్రహములనుబట్టి రంగయ్యకు ఆరు అనుకూలమైన దశలూ, ఆరు అను కూలములేని దశలున్నాయని చెప్పవచ్చును. ఇంతవరకు నక్షత్రమును బట్టి దశలూ, వాటిలో అనుకూల అనానుకూల దశలను తెలుసుకొన్నాము. ఇప్పుడు ఏ దశ ఎంతకాలముండునో వివరముగా తెలుసుకొందాము.

39. దశల కాలములు

కొందరు మాటల సందర్భములో వాని దశ బాగుంది, అందువలన వాడు పట్టినదంతా బంగారమౌతూవుంది అని అంటుంటారు. చాలామందికి వారి గ్రహచారముల మీద నమ్మకములేకున్నా, వారి గ్రహచారమును గురించి వారికి తెలియకున్నా దశలలోనే బాగా జరుగునని అనుకొనుచుందురు. కొందరు జ్యోతిష్యులు కూడా గ్రహచారముకంటే మంచి దశలలోనే బాగా జరుగునని చెప్పుచుందురు. జ్యోతిష్య విషయము తెలియనివారు కూడా దశ బాగుంటే ఏమైనా జరుగుతుందని, ఎంత లాభమైన వస్తుందని అనుచుందురు. ఎవడైనా నష్టపోయినా, కష్టపడుచుండినా వానిని చూచిన వారు వాని దశ బాగాలేదు అందువలన అలా జరుగుచున్నదని చెప్పు చుందురు. వాస్తవానికి ప్రపంచ కర్మలలో మనిషి మీద దశల ప్రభావము అంతగా ఉండదు. మనిషి పడు కష్టములకైనా, అనుభవించు సుఖములకైనా ముఖ్యముగా గ్రహచారమే కారణమని చెప్పవచ్చును. దశల ప్రభావము ప్రపంచ విషయములలో కనీసము పదిశాతము కూడా ఉండదు. కాల చక్ర లగ్నములలో మంచి చెడు గ్రహములు తిరుగుచూ కర్మచక్రము నుండి