పుట:Jyothishya shastramu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందించు ఫలితములనుబట్టి మనిషి యొక్క కష్టసుఖములుండును. కేవలము దైవ జ్ఞాన విషయములలోనున్న వారికి మాత్రము దశలనుబట్టి వాని కర్మ రద్దవునదీ లేనిదీ తెలియును. జ్ఞానులైన వారికి మంచిదశలో వారి కర్మలు జ్ఞానాగ్నిచే ఎక్కువ దహించబడును. చెడు దశలో కర్మలు కాలిపోవడములో ఆలస్యమగును. మంచి దశ వచ్చినప్పుడు జ్ఞాన ధనము కల్గినవారు ఇతరుల కర్మలనుగానీ, తమ కర్మలనుగానీ ఎక్కువగా నిర్మూలించు కొనుటకు అవకాశము కలదు. మంచి దశలలో ఎండాకాలము ఎండిన కట్టెలు సులభముగా కాలిపోయినట్లు కర్మలు కూడా తమ జ్ఞానాగ్ని చేత కాలిపోవును. అదే చెడు దశలో వానల కాలము తడిసిన కట్టెలు సరిగా కాలనట్లు కర్మలు దహించడములో కొంత ఆటంకము, ఆలస్యము ఏర్పడును. దశలన్నీ మనిషిలోని జ్ఞానము అజ్ఞానమునుబట్టి పని చేయునని తెలియవలెను. జ్ఞానములేని సాధారణ వ్యక్తులకు కాల, కర్మచక్రములనుండి లభ్యమగు గ్రహచారమునుబట్టి వారికి కష్టసుఖములుండును. ఏ మనిషికైనా అన్ని అనుకూలములుగా జీవితము సాగుచుంటే అది వాని గ్రహచార కర్మఫలమని తెలియవలెను. అట్లుకాక ఎక్కువ కష్టములు సంభవించుచూ, అన్ని విషయములలో ఆటంకము ఏర్పడుటకు కూడా వాని గ్రహచారమే కారణము.

ఇప్పుడు దశల కాల విషయమునకు వస్తాము. ఇంతవరకు ఎందరో మేధావులు జ్యోతిష్యశాస్త్రమును వ్రాశారు. వారికున్న మేధాశక్తి ముందర నేను అల్పుడనని ఒప్పుకోక తప్పదు. అంతపెద్దవారు వ్రాసిన దానిని కాదనీ వారు వ్రాసిన విషయములు కొన్ని శాస్త్రబద్ధత లేనివని ఖండిరచి వేరుగా చెప్పడము మా పనిగానీ, నా పని కాదని తెలియవలెను. జ్యోతిష్య శాస్త్రమును వ్రాసే విజ్ఞానముగానీ, జ్ఞానముగానీ నాకు లేదు. పైకి ఈ