పుట:Jyothishya shastramu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుక్రుడు కాలచక్రములో తనకున్న వేగముతో ఒక లగ్నమును దాటుటకు 1 నెల పట్టగా, 12 లగ్నములను దాటుటకు 1 సం॥ పట్టును.

శని కాలచక్రములో తనకున్న వేగముతో ఒక లగ్నమును దాటుటకు 2½ సం॥ పట్టగా, 12 లగ్నములను దాటుటకు 30 సం॥ పట్టును.

రాహువు కాలచక్రములో తనకున్న వేగముతో ఒక లగ్నమును దాటుటకు 1½ సం॥ పట్టగా, 12 లగ్నములను దాటుటకు 18 సం॥ పట్టును.

కేతువు కాలచక్రములో తనకున్న వేగముతో ఒక లగ్నమును దాటుటకు 1½ సం॥ పట్టగా, 12 లగ్నములను దాటుటకు 18 సం॥ పట్టును.

మిత్ర కాలచక్రములో తనకున్న వేగముతో ఒక లగ్నమును దాటుటకు 1½ సం॥ పట్టగా, 12 లగ్నములను దాటుటకు 18 సం॥ పట్టును.

చిత్ర కాలచక్రములో తనకున్న వేగముతో ఒక లగ్నమును దాటుటకు 1½ సం॥ పట్టగా, 12 లగ్నములను దాటుటకు 18 సం॥ పట్టును.

భూమి కాలచక్రములో తనకున్న వేగముతో ఒక లగ్నమును దాటుటకు 1 నెల పట్టగా, 12 లగ్నములను దాటుటకు 1 సం॥ పట్టును.

ఈ విధముగా రాహు, కేతు, మిత్ర, చిత్ర అను నాలుగు గ్రహములు ఒకే వేగముతో కాలచక్రమును 18 సం॥ములలో ఒకమారు దాటుచున్నవి. అదే విధముగా సూర్య, బుధ, శుక్ర, భూమి అను నాలుగు గ్రహములు ఒకే వేగముతో కాలచక్రమును 1 సం॥ములో దాటుచున్నవి. ఇకపోతే చంద్రుడు 30 దినములలో కాలచక్ర పన్నెండు లగ్నములను దాటివేయగా, శని గ్రహము 30 సం॥ములలో కాలచక్రములోనున్న పన్నెండు లగ్నములను దాటుచున్నది. కుజ గ్రహము మొత్తము కాలచక్ర లగ్నములను దాటుటకు