పుట:Jyothishya shastramu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ విధముగా ద్వాదశ గ్రహములు కర్మచక్రములోని ప్రారబ్ధకర్మను స్వీకరించి మనిషిచేత అనుభవింపజేయుచున్నవి. ఎల్లకాలము మనిషి ఒకే విధమైన కర్మను అనుభవింపక కాలము గడచుకొద్దీ వేరువేరు కర్మలను అనుభవిస్తూ పోవుచుండును. అందుకొరకు గ్రహములు తనస్థానములను వదలి వేరుస్థానములలో ప్రవేశించి, అక్కడి క్రొత్త కర్మను కూడా స్వీకరించ వలసియున్నది. కావున ద్వాదశ గ్రహములు కర్మచక్రము మీద తమ కిరణములను వేరువేరు స్థానముల మీద ప్రసరింపజేయుటకు, కాల చక్రములో కొంత వేగముతో కదిలి తిరుగవలసివచ్చుచున్నది.

31. రాశి అంటే ఏమి? లగ్నము అంటే ఏమి?

జ్యోతిష్యులందరూ పన్నెండు స్థానములను రాశులనీ, అలాగే లగ్నములనీ పలుకుచుందురు. ఒకప్పుడు వృషభలగ్నమని పేరును జోడిరచి చెప్పిన దానినే మరొకప్పుడు వృషభరాశి అని చెప్పుచుందురు. ఒకమారు లగ్నమని మరొకమారు రాశియని ఒకే స్థానమును చెప్పుట వలన, రాశి అనినా లగ్నమనినా ఒకటేనని చాలామంది అనుకోవడము జరుగుచున్నది. వాస్తవానికి రాశి వేరనీ, లగ్నము వేరనీ తెలియవలెను. కాలచక్రములోని పన్నెండు స్థానములను లగ్నములని చెప్పవచ్చును. అలాగే కర్మచక్రములోని పన్నెండు స్థానములను పన్నెండు రాశులని చెప్పవచ్చును. కాలచక్రములోని భాగములను మాత్రమే లగ్నమనాలి. లగ్నము అనుమాటను కాలచక్రములో నున్న ఏ స్థానమునకైనా వాడవచ్చునుగానీ, ఎటువంటి సందర్భములో