ఈ పుట అచ్చుదిద్దబడ్డది
విన దానిని మరచి ముందుకుఁ బోయిన యెడల రెండును బోధపడనేరవు. ఒకానొకప్పడు ఎన్ని పర్యాయములు చదివినను బోధపడనివాక్యము లున్నయెడల అచ్చట పెన్‌సిలుతో గుర్తులు పెట్టుకొని పుస్తకమంతయుఁ బూర్తిచేసినతరువాత వానిని తిరిగిచదివినయెడలఁ బూర్వపర సంబంధములను బట్టి యవి బోధ పడగలవు. ఈగ్రంథములో పర్ణింపబడిన పదార్థయలలో ననేకము లత్యంతసూక్ష్మములు, చర్మ చక్షువులకుఁ గానరావు కావున సూక్ష్మదర్శిని యనుదివ్యదృష్టిని సంపాదించి యిందువర్ణింపఁ బడినపదార్ధముల బ్రత్యక్షముగఁ జూచుచు శాస్త్రమునభ్యసించినయెడల నది యధికసులభముగను అధికత్వరలోను బోధ పడtగలదు, సూక్ష్మదర్శనియొక్కపటము ఈ గ్రంథారంభమున నీయబడినది. ధాని వర్ణనకై 338-వ పుటయందలి పరిశిష్టము చూడనగు.
కె.వి.లక్ష్మనరావు
సంపాదకుడు