వివరించెడు శాస్త్రమునకు శరీర స్థూలనిర్మాణశాస్త్రమని పేరు. వేఱువేఱు జంతువుల స్థూల శరీర నిర్మాణములను పోల్చిచూచెడు శాస్త్రమునకు స్థూలనిర్మాణ తాతతమ్యశాస్త్రము (Comparative Anatomy) అని పేరు.
ఈయస్థులలోని సామ్యముల గనిపెట్టినయెడల ఏయేజంతువుల కెట్టిసంబంధముకలదో స్పష్టముగ దెలియును. పైమాంసము, చర్మములవలన వేఱు వేఱుగా గానవచ్చినను, లోపలిఎముకల బరీక్షించినయెడల, పక్షి రెక్క, కోతికాలు, మనుష్యుని చెయ్యి ఈ మూడును ఒక విధమైనవియేయని తేలగలదు. కొన్ని కోతుల యస్థిపంజరములను, మానవును యస్థిపంజరమును ఒక్కచోట నుంచి చూచిన యెడల ఈ ప్రాణుల కన్నింటికిని మిక్కిలిదగ్గిర సంబంధము కలదని స్పష్ట పడగలదు.
జీవశాస్త్రమును అభ్యసించు విధము.
పైని పేర్కొన బడిన యంశములన్నియు జ్ఞాపకముంచుకొని యీ గ్రంథ మంతయు జదివిన యెడల నది చక్కగ బోధపడ గలదు. జీవశాస్త్రము ద్విభాగాత్మకమని యిదివఱకే చెప్పియున్నాము. ఇప్పు డీగ్రంథమునందు జంతువులు కొన్నియు వృక్షములు కొన్నియు నొక దానిప్రక్కనొకటి వర్ణింప బడుచు వానికి గలసంబంధ బాంధవ్యములును, తారతమ్యములును సూచింపబడినవి. అందు జంతువులకు వృక్షములకు గల సంబంధములు 1-వ పుట మొదలు 218-వ పుటవఱకు నుండు మొదటిభాగమున వర్ణింపబడినది. వృక్షజాతుల గూర్చిన ప్రత్యేక విషయములు 214-వ పుట మొదలు 321-వ పుట వఱకు రెండవభాగమును వ్రాయబడినవి.
ఈ జీవశాస్త్రమే గాక యేభౌతిక శాస్త్రమైనను శ్రద్ధతో జదువనిది బోధపడ నేరదు. శాస్త్రములు కథలవంటివికావు. సులభ శైలిన వ్రాయబడినను విషయప్రవేశము లేనివారికి నవి మొదట గొంచెము కఠినముగా నుండును. కాని యంతమాత్రమున దానిని విడవకూడదు. తెలియనివాక్యమును మిగుల శ్రద్ధతో రెండుమూడు పర్యాయములు చదువవలెను. మొదట చదివిన యంశమును గట్టిపఱచుకొని ముందుకు పోవలయును. అటుల చేయక మొదట చది