ఈ పుట ఆమోదించబడ్డది
జాతి జంతువులలోగూడ నిట్లే స్త్రీపురుషబీజముల సంయోగము చేతనే పిండ మేర్పడుచున్నది. ఇట్టి పిండోత్పత్తివలన నేర్పడిన కణమునకు సంయుక్త బీజమనిపేరు. ఈ సంయుక్తబీజము తనచుట్టును దళమైన కణకవచ మేర్పరచుకొని యింతటినుండియు అండ మనబడుచున్నది.
పైన చెప్పబడిన సంయోగబలిమచే స్థూలబీజమునందును, స్థూలబీజాశయమునందును, అండాశయమునందును అద్భుతమైన మార్పులు గలుగును. ఈమార్పులయొక్క పర్యవసానముగా గింజయును కాయయు నేర్పడును.