ఆరవ ప్రకరణము.
కాయ (The Fruit)
అయిదవప్రకరణమునందు మనము చూచియుండిన స్త్రీపురుషబీజముల సంయోగముచేత నేర్పడిన సంయుక్తబీజము సంయోగబలిమిచేత నవీనమైనశక్తిగలిగిన దగును. ఈశక్తివలన స్థూల బీజమునందును, స్థూలబీజాశయమునందును, అండాశయమునందును గూడ ననేకమార్పులు కలుగును. స్థూలబీజాశయము నందలి మార్పులవలన పరిణమించిన భాగమునకు గింజయని పేరు. అండాశయముయొక్క పరిణామరూపమునకు కాయయని పేరు. కాని యొకానొకప్పుడు అండాశయమునందేగాక పుష్పముయొక్క సంరక్షణపత్రములు, ఆకర్షణపత్రములు మొదలగు నితరభాగములలోగూడ విచిత్రమైన మార్పులు పై జెప్పబడిన స్త్రీపురుషబీజసంయోగ బలిమిచేగలుగును. అట్టి హెచ్చుమార్పు చేగలిగిన నిర్మాణములనుగూడ మనము సామాన్యముగా కాయలని వాడుచున్నను అవి నిజమైన కాయలుకావు. పనసకాయను చూడుము. ఇదియొక గుత్తిగానుండెడు యనేక పుష్పముల అండాశయములనుండి పుట్టిన యనేక కాయల సమిశ్రణముచే నేర్పడినకాయ. ఇట్టివానికి దొంగ కాయలనిపేరు. ఇందొక్కక తొన యొక్కొక నిజమైనకాయ.
కాయయొక్క ఉపయోగములు.
ఒక చెట్టుయొక్క కాయలన్నియును ఆ చెట్టుక్రిందనే రాలి పడియుండవలసినయెడల వానినుండి పుట్టు మొక్క లన్నియు