Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూలపదార్థ ముండును. మధ్యభాగము చాలవరకు అవకాశముగానుండును. ఈయవకాశమునందు కణరస ముండును. ఇదిగాక యీకణమునందలి విచిత్రమేమనగా:- ఇందు సూక్ష్మరంధ్రసమీపభాగమున కణకవచములులేని మూడుకణము లుండును. వానిలో నన్నిటికంటె పెద్దది స్థూలబీజము (Magaspore), తక్కిన రెండుకణములు సహాయకణములు (Help Cells) అనబడును. వీని కెదురువైపున అనగా పీఠపువైపున ప్రతిపాదకణములు (Anti-Odal Cells) అనుమూడుకణము లుండును. పిండతిత్తియొక్క మధ్యభాగమున మూలపదార్థములో నిమిడి ఉపజీవస్థానము (Second-y Nucleus) అను స్ఫుటమైన జీవస్థానము గలదు. ఇంతవరకు స్థూలబీజాశయ నిర్మాణము.

ఇక కొనదిమ్మమీద జేరిన సూక్ష్మబీజముయొక్క నిర్మాణమును పరీక్షింతము.

సూక్ష్మబీజముయొక్క సూక్ష్మనిర్మాణము.

ప్రథమమున సూక్ష్మబీజ మేకకణము. కాని యదికొనదిమ్మను జేరకమునుపే రెండుకణములుగా విభజనమగును (81-వ పటముచూడుము). అందొక కణముచిన్నది. (ఉ. క); ఇది పెద్దకణముయొక్క మూలపదార్థములో థారాళముగ తిరుగుచుండును. ఈ చిన్నకణమునకు ఉత్పాదకకణము (Generative Cell) అనిపేరు. అనగా నిది సృష్టించుశక్తిగలది. రెండవది అనగాపెద్దకణము పాలకకణము (Vegetative Cell) అనగా పెంచునట్టి