పుట:Jeevasastra Samgrahamu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జొచ్చి వాడిపోవును. ఇందువలన జంతువులశరీరములో నున్నటుల వృక్షములలోగూడ జ్ఞానతంతుజాలము (Nervous System) ఉన్న దేమోయని కొందఱుశాస్త్రజ్ఞు లూహించెదరు. కాని యట్టిజాల మెవ్వరును ఇదివఱకు గనిపెట్టలేదు. పిడుగువలన మానవులు చనిపోవునటుల నే వృక్షములును మృతినొందును. కొన్ని వృక్షములమీద నల్లమందునీళ్లు చల్లినయెడల నవి మత్తెక్కిన వానివలె నగును. కొన్ని విషములు పోసిన బ్రాణులవలెనే వృక్షములు చచ్చును.

వాన్‌మార్షియస్ అనుబాటసారి అమెరికాఖండములోని ఉష్ణప్రదేశములో దిరుగునప్పుడు 'మిమోసా' యనువృక్షముల యరణ్యము గనుగొనెను. అందునగుఱించి యాత డిట్లువ్రాసెను. 'నా గుఱ్ఱపు కాళ్లచప్పుడు వినినతోడనే యాచెట్టుయొక్క యాకులు త్వరత్వరగా మూసికొనిపోయెను. మఱియు మిక్కిలి భయపడినవానివలె గానవచ్చెను. ' డెస్పాంటెనిస్ అను పేరుగల మఱియొకశోధకు డీచెట్టును అనేకరీతుల బరీక్షించిచూచెను. ఈతడిట్టియొక చిన్న వృక్షమును తనబండిలోనుంచుకొని బయలుదేరెను. బండి కదలినతోడనే ఆచెట్టు ఆకులన్నియు నొకటితరువాతనొకటి మూసికొనెను. కొంతసేపు ఆబండి యటులనే నడచుచుండ నవి విచ్చెను. బండి యాగినతోడనే యవి మరలమూసికొనెను.

మఱియొక విచిత్రమైనచెట్టు అమెరికాదేశములో గలదు. అది పురుగులను బట్టుకొని భక్షించును. ఆకుమీద కీటకము కూర్చుండినతోడనే యాయాకు ముడుచుకొనును. ఆకీటకము చచ్చి దానిశరీరములోని రసమంతయు ఆవృక్ష శరీరములో జీర్ణమయినతరువాత నది మరల దెరచును. తమకు భక్ష్యమైన కీటకములు వచ్చినప్పుడే యాయాకులు మూసికొనును. కీటకమునకు బదులు ఒక చిన్నరాయి యుంచిన నవి మూసికొనవు! అనగా నిదిరాయి, యిది కీటకము అనిన తారతమ్యజ్ఞాన మావృక్షమునకు గలదని యెంచవలసి యున్నది.

ఇట్టి పైవర్ణనవలన వృక్షములు సచేతనములని చదువరులు గ్రహించియుందురు. ఇంతియకాదు. వృక్షములలు సచేతనములగుటయే గాక సచేతనత్వమునకు జనయిత్రులు; సచేతనత్వముకు మూలాధారములు. వృక్షములవలన అచేతనపదా