పుట:Jeevasastra Samgrahamu.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంగ్రహము.

ఏకకణవృక్షములనుండి హెచ్చుతరగతివృక్షము లెట్లుపరిణమించునో సంగ్రహముగ నాలోచించెదము. 31-వ పటములో జూపబడినవానివంటి యేకకణప్రాణులేవో కొన్ని తప్ప తక్కిన వృక్షజాతిప్రాణులన్నియు అనేకకణములచే నేర్పడినవియే. అట్టిప్రాణులలో కణములు పంక్తులుగా నమరి దారములవలె నుండు పసిరికపోగు బూజుపోగులగూర్చి చదివియుంటిమి. ఇట్టి యనేకదారములచే నేయబడిన పలుచనివస్త్రమువలె నుండు ఏక పత్రము (Monostroma) అనుకణముల చదరపుపరుపునుగూడ జూచియుంటిమి. ఇందలికణములు ఇటికలచప్టాయందలి ఇటికలవలె పేర్చబడియుండునని చెప్పవచ్చును. వారిపర్ణి యిట్టికణములచే నిర్మింపబడిన పలవలుగల స్తంభమువలె నున్నదని యూహింపదగియున్నది. కాబట్టి వానినిర్మాణమునుబట్టి పరీక్షింపగా నిదివరకు జదివినప్రాణులు వరుసగా ఏకకణములు, కణములపంక్తులు, కణములచదరపు పేర్పులు, కణములగుట్టలు అను నాలుగుతరగతులుగా నేర్పడుచున్నవి.

ఈవరకు జెప్పబడిన వృక్షములన్నియు నీటిచే భరింపబడిదానియందు మునిగి తేలుచుండుటచే తమంతట తాము నిలుచుటశక్తిలేనివై యున్నవి. పసిరికపోగులయం దుండుకణము లన్నిటికి వ్యాపారభేదములు లేమిచే కణములన్నియు సర్వవిషయముల నొకదాని నొకటి బోలియుండును. వారిపర్ణి తనకు కావలసినయాహారమును నీటినుండి కొంతవరకును, దాని యడుగుననుండు బురదనుండి