ఈ పుట ఆమోదించబడ్డది
చూడుము). జీవస్థానములోపల వల యల్లికవంటి యల్లికయు, ఆ వలయొక్క కండ్లలో నిమిడి కొంచెము పలుచని పదార్థమును గలదు. ఈ వల యల్లికయందలి త్రాళ్లవంటిభాగములు మిక్కిలి చక్కగ రంగులు పట్టునవగుట చేత వానికి వర్షేణి (Chromatin) అనియు, రంగులు పట్టని వలకండ్లయందలి కొంచెము పలుచని పదార్థమునకు అవర్షేణి (Achromatin) అనియు పేరు. జీవస్థానపు మధ్యభాగమున అంతర్జీవస్థానము (Nucleolus) అనబడెడు యిసుక నలుసులవంటి పదార్థముగలభాగము గలదు.
ఆకర్షణబింబము.
జీవస్థానమునకు వెలుపలివైపున ఆకర్షణబింబమను మూలపదార్థపుకూడిక గలదు. ఇది కణముయొక్క విభాగవ్యాపారమును నడపుశక్తిగలభాగమని కనిపట్టియున్నారు. ఈ యాకర్షణబింబములు జంతుకణములందు సర్వసామాన్యముగా కానవచ్చుచున్నవి. కాని హెచ్చుజాతివృక్షములయందలి విభాగమగుచుండు కణములలోగూడ నీయకర్షణబింబములు కనిపట్టబడినవి.