పుట:Jeevasastra Samgrahamu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేతవలె నుండు అల్లిక యగపడును (A). దాని యుపరితలముననుండి మృదువైన నూలుదారములవంటి పోగులు పైతట్టున గాలిలోనికిని, క్రిందిభాగమున ఆరీతిగనే యుండు కొంచెము పొట్టిపోగులు నీటిలోనికిని వ్యాపించియుండును. వీనికి క్రమముగ ఊర్ధ్వతంతువులనియు (Aerial hyphae). అధస్తంతువులనియు (Submerged hyphae) పేరు.

బూజుపోగు అనేకకణములపంక్తి.

ఈతుట్టె తెల్లగాగాని, నీలముగాగాని యున్నంతవరకు దాని యుపరితలమున వ్రేలుతో గీచినయెడల ధూళి యేమియు చేతి నంటుకొనదు. ఇందుచే బీజములు పూర్ణముగా తయారు కాలేదని తెలిసికొనవలెను. స్థిరమైన ఆకుపచ్చరంగు కలుగగానే తాకినతోడనే ధూళియంతయు చేతి నంటుకొనును. కంబళి నేతవలె నుండు బూజు తుట్టెను కొంచె మెత్తి రెండు సూదులతో పోగులను విడదీసి సూక్ష్మదర్శనితో పరీక్షించిన, సున్నితమైన దారములు చిక్కగా నలుముకొనినట్లు తెలియగలదు (B1). ఇవియే బూజు పోగులు. ఈ దారములు పొడుగునను సమమైన వర్తులాకారము గలవై నూలులో ఇన్నూటవవంతు అడ్డకొలతగలవై యున్నవి. ఈ పోగులు సూక్ష్మదర్శనిలో చూచునప్పుడు స్వచ్ఛమై చుట్టు కవచము గలవై వెదురుగొట్టములవలె నుండును. మధ్యమధ్య శాఖలు తరుచుగనుండును. ఈ గొట్టమును అనేక అరలుగా విభజించు అడ్డగోడలవలె నుండు పొరలు వెదురుగొట్టపు కనుపులవలె