B2. ఇం దొకపోగు మిక్కిలి పొడుగుగ చూపబడియున్నది. మ. పొ-పోగునందు మధ్యమధ్య నుండు అడ్డుపొరలలో నొకటి. అ-అవకాశము.
C. మొదలు C5. వరకు నుండు పటములు బీజోత్పత్తియందలి వివిధావస్థల సూచించును. C-మధుశిలీంధ్రకణముల బోలియుండు బీజములు. ఇందు కొన్ని పొడుగుగ సాగి పోగు లగుచున్నవి.
C1. పోగులయొక్క చివరభాగమున నుండు పలవలు పొట్టివిగ నున్నవి.
C2. ఇం దొక పలవయొక్క చివర నురివోసి తెంపబడినట్లుగా నుండెడి బీజమొకటి గలదు.
C3. C4. బీజములు క్రమముగా నధికమై యొకదానిక్రింద మరియొకటి చేరుచున్నవి. అం దన్నిటికంటె పైనున్న బీజము పెద్దది. ఇది ముదురుది. దాని క్రిందనున్న బీజములు క్రమముగా నొక దానికంటె మరియొకటి చిన్నది.
C5. ఇందు బీజములు ముదిరి రాలిపోవుచున్నవి. ఇవి యన్నియు బూజుపోగుల పై గప్పి వాని రూపము స్పష్టముగ కనబడకుండ జేయుచున్నవి.
ఇట్లు క్రమక్రమముగ తెలుపు నీలముగను, నీలము ఆకుపచ్చగను, మారి, తుదకు తుట్టె యావత్తును సరిసమానమైన ఆకుపచ్చరంగు గలదగును. ఇదియే బూజు.
సూక్ష్మనిర్మాణము.
పై జెప్పబడిన బూజుతుట్టెలు మిక్కిలి చిన్నవై నాలుగైదునూళ్ల వ్యాసము కలవిగా నుండునప్పుడే నలిగి పోకుండ సూదితో నెత్తి సూక్ష్మదర్శనిలో పరీక్షించవచ్చును. దీనిని తగ్గు దృక్ఛక్తి (Low Power) తో చూడ, ఈ తుట్టెయందు కంబళి