దవ్వచుట్టు నుండునది పట్ట (A. B.లలో పట్ట చూడుము). పట్టచుట్టు నావరించుకొని యొక పలుచనిపొర గలదు (B-లో పై పొర చూడుము). మూలపదార్థమునందు బద్దవలె నుండు నొక పెద్దజీవస్థానమును (Nucleus) దానిసమీపమున గుండ్రనైన యొక చిన్న జీవస్థానమును గలవు (B-లో జీ. చూడుము). ఇవిగాక సంకోచనావకాశ మొకటి గలదు (A-లో సం. అ). కొనవైపున నున్న విశాలమైన గిన్నెవంటిభాగమునకు దళసరియైన బద్దవంటి అంచు గలదు (A-లో అంచు). ఈ అంచుపైని ఇత్తడి సిబ్బి మూతవలె నిమిడియుండు బిళ్ల యొకటి గలదు. (A-లో మూ. బి). ఇది యొకప్రక్కను కొంచె మెత్తబడియుండును. ఇట్లెత్తబడిన చోట అంచునకును, మూతకును మధ్యనున్న సందే దీని నోరు (A. B. లలో నో). దీనినుండి మూలపదార్థములోనికి గొంతుకవంటి గొట్ట మొకటి గలదు (A. B. లలో గొం).
బద్దవంటి అంచుయొక్క లోపలివైపున నంటి యొకవరుస మృదురోమములు గలవు (A-లో మృ. రో). ఈ మృదురోమములు క్రిందివైపున గొంతుగొట్టము పొడుగునను (B-లో మృ. రో). పై వైపున మూతబిళ్ల యొక్క తెరవబడిన భాగమువరకును వ్యాపించియుండును. దీని దేహమునం దితరభాగములం దెక్కడను మృదురోమములు లేవు. ఈ మృదురోమము లన్నియు మిక్కిలి వేగమున కొట్టుకొనుచు ప్రక్కలనుండు నీటియందు గిరగిర తిరుగుచుండు సుడిగుండ్రమును కలుగజేయును. ఈ