పుట:Jeevasastra Samgrahamu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆరవ ప్రకరణము.

ఆవర్తకారి (Vorticella).

సామాన్యముగా ప్రతిగుంట నీటియందును ఆవర్తకారు లనేకము లుండును. ఇవి కొన్ని తుక్కునంటియు, కొన్ని నీటిపురుగుల కాళ్ల నంటియు, మరికొన్ని కంపలను, రాళ్లను అంటియు చిన్న చిన్న గంధపుగిన్నెలవలె కంటికి మినుకుమినుకుమనుచు రమ్యముగ వ్రేలాడుచుండును. వీనిని కొందరు శాస్త్రజ్ఞులు తలక్రిందుగా నుండు పొడుగుపిడిగల గంటలవలె నుండునని వర్ణించియున్నారు. ఆవర్తకారియొక్క మొదటిభాగము స్థిరముగ నితర పదార్థముల నంటియుండి యందుండి మొలచినటుల గానవచ్చుటచే ఇది వృక్షజాతిలోనిదేమో యని భ్రమగలుగవచ్చును. అ మొదటిభాగము పొడుగుగ కాడవలెనుండును గాన దానికిని కాడయనియే పేరు (10-వ పటములో A-లో కాడ చూడుము). A-లో చివరభాగము వికసించి గిన్నెవలె నుండుటచే దానికి గిన్నయని పేరు.

ఆవర్తకారియొక్క నిర్మాణము.

గీన్నె యందలి మూలపదార్థమునందు పట్టయనియు (Cortex),దవ్వయనియు (Medulla), రెండుభాగములు గలవు. మధ్యనుండునది దవ్వ (10-వ పటములో A. B. లలో దవ్వ చూడుము).