ముగా నున్న ఆహారము నుపయోగించుచు జీవించు చుండును. వీనికి పరాన్న భుక్కులు (ఇతరుల యాహారమును తినునవి. Parasites) అని పేరు. ఇందు కొన్ని తమ నివాసములగు జీవులయొక్క సజీవభాగములనే అనగా ప్రాణముతో నున్న వానిచే తినుచుండును. మసూచికము (Small-Pox), మహామారి (Plague), విషూచి (Cholera), క్షయము (Tuberculosis), కుష్ఠరోగము (Leprosy), సెగ (Gonorrhoea), కొరుకు (సవ్వాయి-Syphilis), సన్నిపాతజ్వరము (Typhoid Fever), మన్యపుజ్వరము (Malarial Fever) మున్నగు మానవరోగములును, దొమ్మ (Anthrax), గాళ్లు (Foot & Mouth-disease), కింక (Rinderpest), కల్లవాపు లేక చప్ప్వాపు ()Quarter-ill మొదలగు పశురోగములును నీ జంతు భుక్కులగు సూక్ష్మజీవులవలననే గలుగుచున్నవి. ఇందు కొన్నిటియొక్క ఆకారములజూపు పట మిందు చేర్పబడియున్నది 51-వ పుటలో 7-వ పటము చూడుము.
చీము ఎట్లు పుట్టుచున్నది ?
ఇవి జంతువుల శరీరమునందలి రక్తము మొదలైన పోషకద్రవములలో ప్రవేశించి వాని నాహారముగా వినియోగపరచుకొనుటయె గాక అవి విసర్జించు విషములచే తమ పోషకులకే రోగము గలుగజేయును. గాయములు, పుండ్లు మొదలగువానియందు చీము పుట్టించునవి యీ సూక్ష్మ జీవులే. అతి వేగమున లోతుగ దొలుచుకొని వ్యాపించు వ్రణములకు క్రోవలుగానుండు సూక్ష్మ గుటికలును (Streptococci), పైపై నుండు కురుపులకు జంటలుగ