ఈ పుట ఆమోదించబడ్డది
సె. - సెగను పుట్టించునది (Goriococcus).ఇది యొక జాతిసూక్ష్మగుటిక. ఇది రెండు రెండు జంటలుగా నుండు నుపజాతిలోనిది. ఇవి సెగజాడ్యముగలవాని యంగమున వెడలు చీమునుండి యెత్తబడినవి. ఇవి యొక తెల్లకణముచే ంరింగబడి, దాని శరీరములో నిముడ్చుకొనబడినవి. దీని కుడిప్రక్కను-మరియొక తెల్లకణముగలదు. అందు సూక్ష్మగుటికలు లేవు.
క. - కలరాను పుట్టించునది (Cholera-Vibrio). ఇది యొక జాతి సూక్ష్మ కంపక. ఇదికామా (,) వలెనుండునని వర్ణింపబడియున్నది.
క్ష. - క్షయమును పుట్టించునది. (Tubercle Bacillus). ఇది యొకసూక్ష్మ దండిక. క్షయరోగియొక్క కఫమునుండి యెత్తబడినది.
కు. - కుష్ఠరోగమును పుట్టించునది (Leprosy Bacillus). ఒకరోగియొక్క పుండునుండి యెత్త బడినది.
దొ. - దొమ్మరోగమును పుట్టించునది (Anthrax Bacillus). ఈరోగముచే చచ్చిన పశువుయొక్క నెత్తురునుండి యెత్తబడినది. ఇది యొక సూక్ష్మదండిక.
- ______________