పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గృహమునకు యజమానుడుగా ఉంటాడు. అతడు పెండ్లి చేసుకొని ఉంటే, అతని భార్య గృహయజ మానురా లవుతుంది. ఉపాధ్యాయుల నామకాగా కొంతసొమ్ము చెల్లించిగాని, ఉచితము గా గాని, తలిదండ్రులతో వసతి గృహములలోనే ఉంటారు. ఇంగ్లీషు పబ్లికుబడులలో ఉండే గృహపద్ధతి జర్మనీలో లేదు. ఇంగ్లాండులో ఈగృహ పద్దతి సర్వజనాదరణ పాత్రమై, వేళ్ళు నాటుకొని ఉన్న ది. పగటిబడులలోని పిల్లలుకూడా కొన్ని గృహము లలో ఉండేటట్లు ఏర్పాటు చేస్తారు. ఈజర్మను బడిలో పదేసిమంది పిల్లలకు ఒకొక్క గృహములో ఉండేటట్లు ఏర్పాటుగా ఉన్నది. ఒకే గృహములో ఆడపిల్ల లను మగపిల్లలను కలిపిఉంచరు. గృహానికి ఉపాధ్యాయుకు యజమానుడు; అనికి భార్య ఉంటే ఆమె యజమానురాలు. వారి పోషణము క్రింద పదిమంది మగపిల్లలుగాని, పదిమంది ఆడ పిల్లలుగాని ఉంటారు. వీరందరున్ను ఒక్క టేబిలు దగ్గర కూర్చుండి భోజనము చేస్తారు. అందరున్ను

77