పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/83

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనే ఆజ్నలు ఈబడిలో లేవు. మొత్తముమీద జర్మనుజాతివారు మంచి శిక్షణములో ఉండడానికి అలవాటుపడి, తమ తమ పనులను సైనికులవలె 'తు,చ' తప్పకుండా చేసుకొంటారు.ఈ బడిలో ఇంటి వద్ద (proctor) గాని, తరగతి పెద్దలు (Monitors) గాని లేరు. పిల్ల లందరున్ను తమ యిష్టము వచ్చినపని చేసుకోవచ్చును. పిల్లలు పొగాకుచుట్టు , సిగరెట్లు కాల్చకూడదు; సారాయములను సేవించకూడదు. పిల్లలెదురు గా ఉపాధ్యాయులుకూడ సిగ రెట్లను, చుట్టలను త్రాగకూడదు.


ఇంగ్లీషు పబ్లికుబడులలో కొంతమంది ఉపాధ్యాయులను గృహోపాధ్యాయులనుగా నియ మిస్తారు. ఉపాధ్యాయులలో అనేకులకు ఉండు టకు ఇండ్లను ఇవ్వనైనా ఇస్తారు; లేకపోతే వారే ఇండ్లను అద్దెకు తీసుకోవ లెను. కాని, అందరు ఉపాధ్యాయులున్ను పిల్లల వ్యాయామక్రీడలలోను, వారి విందులలోను పాల్గొనవలెను. జర్మనీలో ప్రతి ఉపాధ్యాయుళున్ను ఒకొక్క పిల్లల వసతి

76