పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తన టేబిలు మీద చిన్న దేశపటముంటుంది,

గణితమును ప్రఫెసకు క్లీను ఏర్పాటు చేసిన కొత్తద్ధతి ప్రకారము నేర్పు తారు.ఈబడి డైరెక్టరు క్లీ నుశిష్యుడు. గణితములో గొప్ప పేరు గడించిన వారు. ఇంగ్లీషు, ఫ్రెంచిబడులలో జీవశాస్త్రము నంత బాగుగా చెప్పరు. జర్మను పాఠశాలలలో ఇండియాలోని అత్యు తమ కళాశా లలో కంటె ముచివైన జీవ శాస్త్ర పరిశోధనా లయములు, వస్తువ దర్శనశాల , తోటలును, ఉన్నవి. ఇటువంటి సౌకర్యములు లేకపోవడము చేతనే ఇంగ్లీషు విశ్వవిద్యాలయాలలో విద్యా ర్థులు సాధారణముగా జీవశాస్త్రమును అభిమాన విషయముగా తీసుకోరు.

యుద్ధము ముగిసిన తరువాత, ఆటలు, వ్యా యామక్రీడల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకొంటున్నారు. ఈబడిలో ఉర్న హాల్ అనబడే మిక్కిలి నవీన పద్ధతులమీద ఒక వ్యాయామరంగమును నిర్మించినారు. వ్యాయా మము కాగానే పిల్లలకు "వేడినీళ్ళతోనో , చన్నీళ్ళతోనో స్నానము చేయ

66