పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/72

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యారాలన్ని టికీ మూలమైన గడియారములోని వేళను నక్షత్ర పరిశోధన శాలలోని గడియారము ప్రకారము సరి చేస్తూ ఉంటారు. తల్లిగడియా రముఖరీదు 30 పౌనులు, పిల్లగడియారముల డయ లు 1- కి 2 పౌనులు ఖరీదు. అన్నీ ఏక కాలమండు ఒక టే వేళను చూపుతవి.

ఈబడిలో చెప్పే విషయాలలో శాస్త్రము, గణితము విశేషములు, శాస్త్ర విద్య అనుభవము మీర ఎక్కువ ఆధారపడి ఉంటుంది, పుస్తకాల విద్య తక్కువ. పిల్లలు క్లాసులలోకంటె శోధనాగారాలలో ఎక్కువకాల ముంటారు. ప్రతీ విద్యార్థికిన్ని ప్రత్యేకముగా ఒక టేబిలు విద్యు త్ప్రవాహము, గేసు, నీటి గొట్టములు, ఉంటవి. ఈ టేబిలుమీద విద్యార్థి తనపు స్తకాలు, కాగి తాలు ఉంచుకొని పరిశోధనలను చేసుకో వచ్చును. విద్యార్థులు ఉపాధ్యాయులు చేసే పరి శోధనలను చూడడమే కాకుండా, తాముకూడా చేస్తూ ఉంటారు. భూగోళ శాస్త్ర పాఠాలలోకూడా ఇ దేపద్ధతి అవలంబిస్తారు. ప్రతి విద్యార్థికిన్ని


65