పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జర్మినీ దేశము జనసంఖ్య ఆరుకోట్ల ఇరవై లక్షలు. వీరిలో ఈ బడులలో చదువుకొనే పిల్లల సంఖ్త్య 70 లక్షలు. వీరి కోసము 54,000 ప్రారంభ పాఠశాలలున్నవి. వీటిలో 1744 మాధ్యమిక పాఠశాలలు. చదువుకొనే ఆడపిల్లల సంఖ్య మగ పిల్లల సంఖ్య సరిగా ఉంటుంది. మాధ్యమిక ప్పాఠశాలలోని పిల్లలు మొత్తములో నూటికి అయిదు మంది ఉంటారు. ప్రారంభ పాఠశాలలలలోని ఉపాధ్యాయుల సంఖ్య 2,10,300 వీరిలో నూటికి ఇరవై యిద్దరు ఆడవాళ్లు. సగటున ఒక ఉపాధ్యాయునికి 33.3 మంది పిల్లలుంటారు.

మిశ్రమ తరగతులు.

ఆడపిల్లలను మగపిల్లలను కలిపి ప్రారంభ, మాధ్యమిక బడులలో చదువు చెప్పడము విషయమై జర్మినీ దేశములో వివిధాభిప్రాయము లున్నవి. కొన్ని బడులలో ఇద్దరినీ కలిపే చెప్పుతారు. గ్రామ బడులలో ఇది తప్పని సరి. చిన్న పట్టణాలలో ఆడ పిల్లలు, మగపిల్లలు కలిసి ఒకే బడిలో చదువు కొంటారు గాని, వారిని వేఋవేరు క్లాసులలో ఉంచు


36