ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తారు. పాఠక్రమము (Time Table) కోసము ఈ రీతిగా చేస్తారట. ఈ బడులలో ఆటలలో కూడ ఆడపిల్లలున్ను, మగపిల్లలున్ను ఒకరి నొకరు కసులు కోవడముండదు. పెద్ద పట్టణాలలో సర్వ సాధారణముగా ఆడపిల్లలుకున్ను, మగపిల్లలకున్ను బడులు వేర్వేరుగా ఉంటవి
జర్మను విద్యాపద్ధతి జయప్రదము కావడానికి మూలప్రభుత్వము అచ్చు వేసి పంపే పాఠ క్రమములు కారణముగాదు ఆయావిషయాలాలను నేర్పే పద్ధతియే కారణము. ఆ బడులలో ఏవిన్ని పఠనీయ గ్రంధములు నిర్నీతములుగా ఉండవు. ఉపాద్యాయులు తమ పాఠములను తామే ఏర్పరచుకొనవచ్చును. క్రొత్త రాజకీయ పరిస్థితులను బట్టి మూల ప్రభుత్వము వారు క్రొత్తగా పఠనీయ గ్రందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఉపాద్యాయులు జ్గ్నానమును పిల్లలలోనికి క్రుక్కరు. పిల్లలు తమంతట తామే ఆయావిషయాలను తెలుసుకొనేటట్లు సహాయము చేస్తారు. ఏదో ఒక విషయమును తానే కనుక్కొంటునాననిన్నీ, తన
37