ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ధనవంతుల పిల్లలు మిక్కిలి పేదవారి పిల్లలతో కలసి మెలసి, వారితో పాటే చదువుకొంటారు. గొప్ప వారి పిల్లలు తేమ పుట్టిన దినమ్లకు పేద పిల్లలను విందుకు పిలుస్తారు. మీదు మిక్కిలి గొప్ప వారి పిల్లలకు తమలో తమకు పడదట. వారు దెబ్బలాడుకోకుండా వారి మధ్యను పేద పిల్లలను కూర్చో పెట్టవలసి ఉంటుందట. కాని, ధనవంతుల పిల్లలు, కార్మిక కుటుంబముల వారికంటే ఎక్కువ తెలివి తేటలు గలవారుగా ఉంటారట.
పాఠక్రమములు, బోధన విషయములు, ఏవిషయము నెన్నెన్ని గంటలు బోధించడము, ఈ మొదలయిన వాటిని విద్యాంగ మంత్రి ఏర్పాటు చేస్తాడు. ఉన్నత విద్యాలయాల కనుగుణముగా ఈ విషయములు నిర్ణయింప బడుతవి. పిల్లలకు దినమునకు మూడు గంటలు మాత్రమే చదువు. వారమునకు మూడు సార్లు పిల్లలు ఉపాద్యాయులతో విహారాలకు పోతారు. బడి గదులలో కావలసిన
29