వారుముందు ముందు అవలంబింపబోయే వృత్తులతో సంబంధములేకుండా నాలుగేళ్ళు ఒక్కటేబడిలో చదువుకొని ఒకటే రీతి విద్యను నేర్చుకొంటున్నారు. ఈ బడులకు "గ్రుంట్ షూలె" లేక పునాది బడులని కాని, "ఐన్ హేట్ షూలె" లేక ఏకత్వ విద్యాలయములని కాని ఫేళ్లు. వీటిని ప్రారంభవిద్యాలయాలతో కలిపి కాని, ప్రత్యేకముగా కాని, స్థాపించుతున్నారు. వీటిలో పిల్లలు జీతమివ్వనక్కరలేదు. వీటిలోని పేద పిల్లలకు పురపాలక సంభములవారు ఉచితముగా తిండి పెట్టి పుస్తాలిచ్చి, ఒకొక్కప్పుడు బట్టలు కూడ ఇస్తారు. పిల్లలందరున్ను ఒక్కటే మోస్తరు దుస్తులు ధరించ వలెననే నియమము లేదు. కాని, పిల్లల దుస్తులను బట్టి వీరు గొప్పవారు, వీరు పేదవారు అని తెలుసు కొనడము కష్టము. ఇప్పుడు ప్రపంచములో ప్రభలుతు ఉన్న సర్వసామాన్య స్వత్వమనే ఊహ ననుసరించే ఈ బడులు స్థాపితము లవు తున్నవి.
ఈ బడులను తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు అందరున్ను మెచ్చుకొంటున్నారు.
28