పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17 సం|రములకున్ను మధ్య వయస్సువా రబడులకు నిర్బంధముగా పోవలెను. తక్కినవారికి ఐచ్ఛికము.

పట్టణములలోని బడులు అనేకరకములుగా ఉన్నవి. వీటిలో చాలామట్టుకు ప్రయివేటు బడులు. కొన్ని వసతులతో కూడిన క్లబ్బులుగా ఉంటవి. వీటికి పట్టణాలలో చాలామంది పోతుఉంటారు. వీటికి “యూగెండ్ షేమ్” (YLI-gendsheim) అనగా యవనుల గృహములని పేరు, ఫాక్టోరీలలో పనిచేసే వయసువచ్చిన పిల్లలకు ఈబడి అధికారులు పెండ్లిండ్లు చేసి, వసతి గృహములలో వసతులిచ్చి, సాయంకాలము వారికి ఉపన్యాసాలిస్తారు. ఇందునల్ల వారు చెడు సహవాసములలో పడక, విద్యాభివృద్ధి చేసుకొంటారు.


20 లక్షలజనసంఖ్యగల 'బెర్లను పట్టణములో ఇటువంటివి ఏడు ప్రయివేటు సంఘము లున్నవి. వీటిలో ఒకటి ఈక్రింద వర్ణింపబడినది.

ఈ సంఘమును సభ్యు లే ఎన్నకొన్న కమిటీ వారు పరిపాలిస్తారు. సంవత్సరమునకు రెండుషి

180