పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ల్లింగులు చెల్లించేవారు సభ్యులవు తారు. వీరికి తక్కు వజీ తాలకే ఉపన్యాసాలు వినిపిస్తారు. చిన్న పెద్దకం పెనీల వారుకూడా సంఘములో సభ్యులు కావచ్చును. చిన్న సంఘాలకు చందా సం:రమునకు 15 ఫిల్లింగులు, పెద్దవాటికి 30 షిల్లింగులు. . ఈ సంఘమునకు బెర్లిను మ్యునిసిపాలిటీ వారు మొత్తముఖర్చులో నూటికి నాలుగుచొప్పున గ్రాంటిస్తారు. ఖర్చులో నూటికి 2 చొప్పున చం దాలువ స్తవి. మిగిలిన నూటికి 94 ఖర్చున్ను సభ్యులచందాలవల్లను, విద్యార్థుల జీతములవల్లను వస్తుంది. పదహారు వేర్వేరుబడులలో ఉపన్యా సాలిస్తారు. బెర్లినుమ్యునిసిపాలిటీ వారు తమ బడి గృహములను చదువుకోసము ఉచితముగా ఇచ్చి, దీపముల ఖర్చు, బంట్రోతుల ఖర్చు కూడా భరిస్తారు. ఈబడులు ఆయా మ్యునిసిపలుబడుల ప్రధానోపా ధ్యాయుల తనిఖీలో ఉంటవి. తమబడి కాలములో కాక, సాయంకాలము ఈ ప్రధానోపాధ్యాయు లే ఉపన్యాసాలిప్పిస్తారు. ఈసంఘము యాజమా న్యముక్రింది బడులలో 20,545 విద్యార్థులు చదు


181