పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెద్దపట్టణములలోని ఈపాఠ శాలలకు వసతిగృహములుకూడా చేరిఉంటవి. వీటికి "యూగెండ్ షేమ్” అని పేరు. వీటిలో పిల్లలు తమభోజన సదుపాయములను తామే చేసుకోవలెను. ఈ పాఠ శాలలలోని పాఠక్రమమును గవర్న 'మెం టువారు ఏర్పాటు చేసి ఉన్నారు. వీటిలో పని నేర్చుకొనే పిల్లలు వారక్కడినుండిన సంవత్సర మును బట్టి మూరగతులలో ఉంటారు. ఆఖరు పరీక్షను ఆయావృత్తులలో ఆరి తేరినవారి సహాయముతో ఉపాధ్యాయులే చేస్తారు.ఒక పాఠశాలలో 25 వేర్వేరు విద్యలనుకూడా నేర్ప వచ్చును. జర్మనీలో ఆడపిల్లలు, మగపిల్లలుకూడా 14ఏళ్ళ ఈ మనరకు నిర్బంధముగా సామాన్య విద్య నేర్చుకోవ లేనని ఇంతకుముందుతెలుప బడ్డది. ఆతరువాత వారు మరిమూడేళ్ళు నిర్బంధముగా కార్మిక విద్యనో వృత్తి విద్యనో నేర్చుకోవలెను, ఎక్కువ నేర్పు అక్కర లేని వృత్తితీసుకొన్న వారు గాని, పని నేర్చుకొనడమునకుచేరనివారుగాని, “ఫోర్ట్ బిల్డింగ్ షూలె” (Fortbilding Schule)


144