ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వారి వృత్తుల కుపయోగించేటట్లు చెప్పుతారు. శాసనము ప్రకారము బడిలో వారమునకు 8 గం మాత్రమే చదువు చెప్పవలసి ఉన్నా, పది పండ్రెండు గంటలు కూడా చెప్పడము కలదు. యుద్ధమునకు పూర్వము జర్మనీలో ఈ బడులు 3,600 ఉండేవి. వీటిలో 640,000 మంది వి ద్యార్ధులుండేవారు. యుద్ధము తరువాత ఈసంఖ్య నూటికి 50నంతున హెచ్చినది.
పెద్ద పారిశ్రామిక పట్టణములలో, ఏదో ఒక వృత్తి నవలంబించే పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్పుడు, ఆవృత్తికి సంబంధించిన విద్యార్థులకు ప్రత్యేకముగా పాఠశాల లను ఏర్పాటు చేసి “గెవెర్బె షూలే" నుంచి విడదీస్తారు. వృత్తి పాఠశాలకు "బెరుఫ్ షూలె” అని పేరు. “గె వెర్బే షూలే"లో అన్ని వృత్తులకున్న వేరు వేరుగా తరగతులు ఉంటవి; "బెరుఫ్ షూలె"లో ఏదోఒక్క వృత్తినే బోధిస్తారు.కొన్ని స్థలాలలో వృత్తికరగతులను ప్రారంభ పాఠశాలలకు చేర్చు తారు; ఈ పాఠశాలలకు “ఫర్ క్లాసెస్" అని పేరు.
143