పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/134

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వచ్చును. ఈ సంఘము కార్యనిర్వాహకవర్గ పండ్రెండుగురు సభ్యులుంటారు. వీరిని సాధారణ సభ్యులు ఎన్ను కొంటారు. వీరిలో నలుగురిని అధ్యాపకులు తమలో తాము ఎన్నుకొంటారు. నలుగురిని విద్యార్థులు తమ వారిని ఎన్ను కొంటారు. తక్కిన నలుగురిని విద్యార్థులు కాని ఇతర సభ్యులు తమలో వారిని ఎన్ను కొంటారు.

(1) అప్పులిచ్చే శాఖ. (9) విద్యార్థులకు ప్రత్యేక ప్రత్యేకముగా సహాయము చేసే శాఖ, (3) విద్యార్థి వేతనముల నిచ్చేశాఖ. (4) స్వదేశ విద్యార్థులను పర దేశ ములకు పంపించి, వారి స్థానే పర దేశవిద్యార్థులను రప్పించే శాఖ. (5) సంఘము పనిని మొత్తముమీద సాగించే శాఖ, (6) సంఘమును గురించి ప్రకటనలను చేసి దానిని అభివృద్ధి పొందిం చేశాఖ, అనే శాఖలతో సంఘము పనిచేస్తుంది. 127