పుట:JanapadaGayyaalu.djvu/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బడిన ఈ "జానపదగేయాలు" ప్రచురించటం జరిగింది. ఇది మా అకాడమి యొక్క రెండవ ప్రచురణ.

కళాప్రపూర్ణ డా|| శ్రీమతి అనసూయదేవి జానపదగేయాలను స్వరపరచి సంగీత అకాడమికి ఇచ్చి అకాడమి ద్వారా ముద్రించటం ముదావహము. ఈ సంతోషమే నేను ఈ నాలుగు మాటలు వ్రాయుటకు కారణము.

అనసూయ అంటే అసూయ లేనిది అని అర్థం. కాని అనసూయ అంటే చాలా మందికి అసూయ ఉంది.

అనసూయ, అంటే అసూయ లేనిది అని అర్థం.కాని, అనసూయ అంటే చాలా మందికి అసూయ వుంది. ఇతరులు పలువురు మనల్ని చూసి ఎప్పుడు అసూయ పడతారో, అప్పుడు మనం ప్రసిద్ధులమనీ, మనం అభివృద్ధి పొందుతున్నామనీ, అర్థం చేసుకోవాలి. ఎవరో అన్నట్టు జ్ఞాపకం. "The jealousy and controversy are the rails on which the life train can safely travel and reach the destination".

డా|| అనసూయను గురించి నాకంటే తెలిసినవారు, నాకన్న పెద్దవారు అనేకులున్నారు. నాకు సుమారు 1939 నుంచి తెలుసును. ఆ కాలంలోనే, అంటే నాకు బాగా చిన్న వయస్సులోనే, నేనక్కడ పాట కచేరీలకు వెళ్ళినా, అనసూయ, సీత, పాట కచేరీలు వుండేవి. వీళ్ళు నాకు Seniors, ఆత్మీయులు, సోదరీమణులు.

శ్రీమతి అనసూయ గొప్ప పండిత వంశంలో జన్మించారు. వీరి తండ్రిగారు పద్మశ్రీ వింజమూరి లక్ష్మీ నరసింహరావుగారు అద్భుతమైన ప్రతిభాశాలి, గొప్ప కవి. వీరి నాటకాలు, పద్యాలు, వీరి కవిత, దేశం నలుమూలలా వ్యపించింది. వీరి తల్లిగారు వింజమూరి వెంకటరత్నమ్మగారు కూడ గొప్ప కవయిత్రి, విదుషీమణి. "అనసూయ" అనే స్త్రీల మాస పత్రిక సంపాదకు