Jump to content

పుట:JanapadaGayyaalu.djvu/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతను : గొజ్జంగీ పూగుత్తీ

కూలేనే నేలొత్తీ

రాలీన రేకులపై

వాలేదే ఈగైనా

ఎంకులు గాణ్ణి జంపెయనే

డెంకాలోళ్ల యెంకమ్మా

ఎంకులుగాణ్ణి తరిమెయవే

డెంకాలోళ్ల యెంకమ్మా ||


ఆమె : సుక్కల్లా లేడెనెకా

మచ్చల్లా సిందుగురా

పరుగెత్తీ పరుగెత్తీ

ఒరిగిందీ చిరులేదే

ఎంకులా గాణ్ణి ఆపెయరో

లంబాలోళ్ల రమదాసా ||


అతడు : సిందుగుమా జంపేనే

సిరుతొకటీ యెంటడితే

సిరుతానూ యేటాడే

కరిసార్లా పులి ఉరికే

ఎంకులు గాణ్ణి జంపెయనూ

డెంకాలోళ్ల యెంకమ్మా

ఎంకులు గాణ్ణి తరిమెయనూ

డెంకాలోళ్ల యెంకమ్మా ||


(అన్ని చరణాలూ మొదటి చరణం వలె పాడుకోవాలి)


సేకరణ - అడవి బాపిరాజు వద్ద

బందరు (1936)