ఈ పుట ఆమోదించబడ్డది
నాటేరమ్మ నాటేరు
మధ్యమావతి స్వరాలు - ఆదితాళం
1)
- ని స రి ప ప మ మ రి | రి స సా | సా . . ||
- నా - టే - ర - మ్మా - | నా - టే | రూ . . ||
- ఏ మీ మొ క్కా - | నా - టే | రూ - ||
- రీ మ ప పా పా | ప ని ని స | పా ప మ ||
- జా జా - ర మ్మా | తో - టా - | లో నా - ||
- రీ రి మ పా ప మ | రీ రి స | సా . . ||
- జా జీ - మొ క్కా - | నా టే - | రూ . . ||
2)
- సాగేనమ్మా సాగేను
- ఎమి తీగ సాగేను
- జాజారమ్మా తోటాలోనా
- సన్నాజాజీ సాగేను ||
3)
- ఏసేనమ్మా యేసేనూ
- ఏమి సిగురూ యేసేనూ
- జాజారమ్మా తోటాలోనా
- సేమంతులూ సిగిరేసె ||
4)
- తొడిగేనమ్మా తొడిగేను
- ఏమి మొగ్గలు తొడిగేను
- జాజారమ్మా తోటాలోన
- రోజా మొగ్గలు తొడిగేను ||