పుట:JanapadaGayyaalu.djvu/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

163

7)
ఊరవతా లుండేటి, ఊడ మర్రీ కాడ
సన్నజాజుల పుట్టా, చిన్నీ నాగన్నా
నాగాదిగరా, తండ్రీదిగరా, శేషూదిగరా

8)
సూర్యుడు సెంద్రూడు కోలాటమేస్తుంటె
మబ్బూసందున నుండి మాకొంపతీస్తివి
నాగాదిగరా, తండ్రీదిగరా, శేషూదిగరా

9)
నిండూపున్నామనాడు, పండూవెన్నెల లోన
సందామామను మింగూ సర్వానాగన్నా
నాగాదిగరా, తండ్రీదిగరా, శేషూదిగరా ||