ఈ పుట ఆమోదించబడ్డది
135 4)
- మాకూలీ రైతుల కడుపు నిండాల
- మావందులు సల్ల గుండాల || రామానా ||
5)
- ఉత్తరవచ్చే ఎత్తరగంపా
- కారుమేఘాలాకాశం నిండె || రామనా ||
6)
- తొలకర్లొ వర్సాలు కురవా
- లెకరాని కరవై బత్తాలు పండాలి || రామనా ||
7)
- నీరుపెట్టి దుక్కుదున్నాలి - బాబు
- దుక్కి దున్ని మొక్క నాటాలి || రామనా ||
8)
- పక్కలిరిగేలాగ పంట పండాలి
- కరువూ లేకుండా మనమాయ గుండాలి || రామనా ||
9)
- మా రైతు బాబులు బాగుండాలి - ఆరి
- పిల్లా పాపలు సల్లగుండాలి || రామనా ||
10)
- ఆవుల్ని గోవుల్ని మేము కాయాలి
- కాసినందుకు కానుకియ్యాలి || రామనా ||
11)
- పల్లెటూళ్లు బాగుండాలి
- పట్నాల కడుపూలు నిండాలి || రామనా ||
12)
- సిన్నపెద్దలు కలిసిమెలసుండాలి
- ఏవూరు కావూరు ఎంతో బాగుండాలి || రామనా ||
13)
- పైరు కంకులపైని పిల్లపిట్టలు వాలె
- ఇల్లాగ రానువ్వు పిల్లోడ || రామనా ||
14)
- కొట్టకుండా నువ్వు తిట్టకుండా నువ్వు
- అందర్ని బెదిరిస్తె అవతలకు పోవురా || రామనా ||
- సేకరణ - విశాఖపట్నం