పుట:JanapadaGayyaalu.djvu/148

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హోలి హోలీరె

శంకరాభరణ స్వరాలు - ఆది


ఇయ్యాల పున్నామ హోలీ - చెమ్మకేళిరహోలీ

వచ్చేటి పున్నామ హోలీ

కామూని పున్నామ హోలీ

గుట్ట గుట్ట తిరిగినాడె హోలీ

గోగిపువ్వు తెచ్చినాడె హోలీ

బంగారు కొడవలి తీస్కు హోలీ

వాడవాడల పోయినాడ హోలీ

వాడ వాడల తిరిగినాడ హోలీ

వాడ వాడల పోయినాడె హోలీ

సిత్తనగొయ్య పట్తుకూని హోలీ

సింగు సింగు సిత్తినాడె హోలీ