Jump to content

పుట:JanapadaGayyaalu.djvu/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3) తీగతీగ లేసెనే
ఏమితీగ లేసెనే
జలావారి తోటలోను
జామతీగ వేసెనే
          వినండోయి - - - గొబ్బిళ్లో ||

4) కాయ కాయ వేసెనే
ఏమి కాయ లేసెనే
జలావారి తోటలోన
జామకాయ కాసెనే
          వినండోయి - - - వణంగాయి గొబ్బిళ్లో ||

5) పండు పండు పండెనే
ఏమి పండు పండెనే
జలావారి తోటలోన
జామపండు పండెనే
          వినండోయి - - - వణంగాయి గొబ్బిళ్లో ||

6) పాది పాది లేసెనే
ఏమి పాదువేసెనే
జలావారి తోటలోన
జాజిపాదు వేసెనే
          వినండోయి - వణంగాయి గొబ్బిళ్లో ||

               సేకరణ - మా పనిమనిషి భ్రమర వద్ద
                                 1954