పుట:JanapadaGayyaalu.djvu/128

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గొబ్బియళ్ళొ గొబ్బియని పాడరమ్మ

ఖరహరప్రియస్వరాలు - ఆది

1)

గ గా, మ పా, మ | ప ద ని ద | ప ప గ మ ||
గొ బ్బి య ళ్ళో - | గొ బ్బి య ని | పా డ ర మ్మ ||
పా ప ద ప ప మా గ రి సా | రి గ రి | సా ||
ని బ్బ = ర ం పూ చే డె లే | గొ బ్బి య | ళ్ళో ||

2)

గొబ్బియళ్ళో పార్వతి పతిని దలచి
పరమ గొబ్బి తట్టరే గొబ్బియళ్ళొ ||

3)

గొబ్బియళ్ళో గొబ్బియని పాడరమ్మ
కంచివరద రాజమా గొబ్బియళ్ళో ||

4)

గొబ్బియళ్ళో వీధిలో విస్తారమాయె
తేరులో శృంగారమాయె గొబ్బియళ్ళో ||

5)

గొబ్బియళ్ళో ఆవులావులు కదిలెనమ్మ
ఎవ్వరావులు కదిలేనే గొబ్బియళ్ళో ||

6)

గొబ్బియళ్ళో పేరుగల రంగసామి
మందటావులు కదిలేనే గొబ్బియళ్ళో ||

7)

ప ప స పా ప ప సా మ గ మా ||
ఎం డె త్తు ఎం డెం ద న మె త్తూ- ||
ప ద ప మ | గ గ రి సా ||
ఎం డి పూ ల | గొ డు గె త్తూ ||